Header Banner

దుబాయిలో జైలు పాలైన జగిత్యాల యువకుడు! అదే కారణం! సీఎం సహాయం కోరిన తల్లిదండ్రులు!

  Tue May 13, 2025 18:05        Gulf News

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని దుబాయికి బతుకుదెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ (27) అనే యువకుడు ఎవరో తన బ్యాంకు ఖాతాను దుర్వినియోగం చేసి లావాదేవీలు జరిపినందున అజ్మాన్ లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. 

 

మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్, బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ఎన్నారై అడ్వయిజరీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకరించారు. సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజావాణి ఇంచార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. 

 

ఇది కూడా చదవండి సౌదీ అరేబియాలో గ్రీన్ కార్డు! విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ.. వారికి మాత్రమే!

 

గల్ఫ్ దేశంలో జైలు పాలయిన మధుకర్ కు కాన్సులర్ (దౌత్య) సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు అభ్యర్తించారు. న్యూ ఢిల్లీ లోని భారత విదేశాంగ శాఖతో, దుబాయి లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుడిని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (న్యాయ సేవాధికార సంస్థ) కు కూడా పంపారు. 

సమస్య పరిష్కారానికి సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధకు ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి హామీ .

 

ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Jagtial #DubaiNews #NRIProblems #BankFraud #TravelBan